సాక్షి, హైదరాబాద్: నేర నియంత్రణ కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటు చేసిన విష యం తెలిసిందే.
ప్రతీ చిన్న ఘటన కూడా వాటిలో నిక్షిప్తమవుతోంది. కిడ్నాపులు, దాడులు, బాంబుపేలుళ్లు, రోడ్డు ప్రమాదాల్లో నేరస్తులను పట్టుకునేందుకు వీలవుతుంది. గ్రామ అభివృద్ధి నిధులు, పోలీస్ శాఖ , వ్యాపారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ నిధుల నుంచి కొంత మొత్తాన్ని సేకరించి ప్రతీ గ్రామంలో కనీసం 5 నుంచి 10, మండల కేంద్రాల్లో 30, పట్టణాల్లో కనీసం 50, జిల్లా కేంద్రాల్లో 1,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ ప్రతిపాదనలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment