వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ :
గణేశ్ నిమజ్జనంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలో సీసీ కెమెరాల నిఘాతోపాటు 1876 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనుంది. ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా వాహనాల మళ్లింపునకు ఆదేశాలిచ్చింది. ట్రాఫిక్ డైవర్షన్ రూట్లను సైతం ముందస్తుగా ప్రకటించింది. ఈ మేరకు వరంగల్ మట్టెవాడలోని సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్)లో వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నగర పరిధిలో సుమారు 2,000 గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు ఆయన అంచనా వేశారు. 1500 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 200 మంది
హెడ్ కానిస్టేబుళ్లు, 100 మంది ఏఎస్సైలు, 50 మంది ఎస్సైలు, 20 మంది సీఐలు, ఆరుగురు డీఎస్పీలు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నట్లు వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఉత్సవ కమిటీలతోపాటు నగర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రతలు, పోలీసుల బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్‌కు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా నగర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు... సూచనలు
అధికారులు సూచించిన సమయాల్లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలి.
వాహనం వెంట ఉండే ఉత్సవ క మిటీ సభ్యుల పూర్తి వివరాలను నిమజ్జనానికి బయలుదేరే ముందు సంబంధింత పోలీస్ స్టేషన్‌లో అందజేయూలి.
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వాహనాలకు ఏర్పాటు చేసే అలంకరణలు విగ్రహాల ఎత్తు కంటే ఎక్కువగా ఉండొద్దు.
నిమజ్జన యాత్రలో చిన్న పిల్లలు, స్త్రీలు అధికసంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో టపాసులు కాల్చొద్దు.
ఇతర మతస్తుల ప్రార్థన మందిరాల వద్ద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలి.
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఇవ్వొద్దు.
నిమజ్జన వాహనాలు కదులుతున్న సమయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయొద్దు.
డీజే సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించొద్దు.
నిమజ్జన యూత్రలో డ్రైవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం వదిలి వెళ్లకుండా చూడాలి.
నిమజ్జన ప్రదేశం వద్దకు చిన్న పిల్లలు రాకుండా ఉత్సవ కమిటీ జాగ్రత్తలుతీసుకోవాలి.
ట్రాఫిక్ డైవర్షన్ ఇటువైపే...
ములుగు, పరకాల వైపు నుంచి నగరానికి వచ్చే బస్సులు, లారీలను కేయూసీ రోడ్డు మీదుగా మళ్లించాలి.
వరంగల్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, అన్ని వాహనాలు కేయూసీ రోడ్ మీదుగా వెళ్లాలి.
హన్మకొండ బస్టాండ్ నుంచి ములుగు. పరకాల, ఏటూరునాగారం, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల వైపునకు వెళ్లే బస్సులు శ్రీదేవి టాకీస్ (ఏషియన్‌మాల్).. హెడ్‌క్వార్టర్స్... కేయూసీ క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి.
హన్మకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట, తొర్రూరు, కొత్తగూడెం, భద్రాచలం వెళ్లే బస్సులు హంటర్‌రోడ్డు... రంగశాయిపేట మీదుగా చింతల్‌బ్రిడ్జి ద్వారా మళ్లించనున్నారు.
వరంగల్ బస్టాండ్ నుంచి హన్మకొండకు వచ్చే బస్సులు చింతల్‌బ్రిడ్జి, రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్‌పంప్ చౌరస్తా, ఉర్సుగుట్ట రోడ్డు ద్వారా రావాలి.
హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు వంద ఫీట్ల రోడ్డు... కేయూసీ జంక్షన్ మీదుగా పెట్రోల్ పంపు... హన్మకొండ బస్టాండుకు చేరుకోవాలి.
న్యూశాయంపేట నుంచి వినాయక విగ్రహాలను హంటర్‌రోడ్డు... హన్మకొండ మీదుగా పద్మాక్ష్మి గుడికి తరలించాలి. నిమజ్జనం పూర్తి చేసుకున్న వాహనాలు పద్మాక్ష్మిగుట్ట నుంచి నేరుగా శాయంపేట వైపు వెళ్లాలి. (న్యూశాయంపేట నుంచి పద్మాక్ష్మి రోడ్డు మీదుగా నేరుగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు)
హ న్మకొండ పెట్రోల్‌పంప్ నుంచి ములుగు రోడ్డు వరకు ఆర్టీసీ బస్సులకు అనుమతి లేదు.
నగరంలో నిఘా నేత్రాలు
Published Wed, Sep 18 2013 2:53 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement