
మాలి దేశానికి అమెరికా రాయబారిగా ఇండో అమెరికన్ మహిళ రచనా సచ్‌దేవ్‌ను నియమించారు. ఈ మేరకు వైట్‌హౌజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. భారత సంతతి చెందిన రచనా సచ్‌దేవ్ అమెరికా ఫారిన్ సర్వీసెస్‌లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నారు. గతంలో ఆమె శ్రీలంక, సౌదీ అరేబియాలలో పని చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈస్ట్రర్న్ ఎఫైర్స్ విభాగంలో పని చేశారు. తాజాగా మాలి దేశానికి రాయబారిగా నియమించారు అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్.
నెల రోజుల వ్యవధిలో ముగ్గురు భారత సంతతి అధికారులకు రాయబారులుగా పదోన్నతి కల్పించారు జో బైడెన్. మొరాకో దేశానికి రాయబారిగా పునీత్ తల్వార్‌ను నియమించారు. అంతకు ముందు నెదర్లాండ్స్ రాయబారిగా షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను ఎంపిక చేశారు. వీరే కాదు వైట్‌హౌజ్‌లోని బైడెన్ టీమ్‌లో కూడా ఇండో అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
చదవండి: నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా షెఫాలీ జర్దాన్ దుగ్గల్ !
Comments
Please login to add a commentAdd a comment