జమ్మూలో 400 స్కూళ్ల మూసివేత
జమ్ము: పాకిస్తాన్ బలగాలు బుధవారం కూడా సరిహద్దులో బాంబు దాడులకు తెగబడ్డాయి. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్‌లో పాక్ దళాల కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. రాజౌరీ జిల్లా బీజీ సెక్టార్‌లోనూ పాక్ కాల్పులు జరిపింది. భారత దళాలు దీటుగా జవాబిచ్చాయి. కాల్పుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో400 పైగా స్కూళ్లను ప్రభుత్వం మూసివేసింది.
పాక్ జవాన్లు భారత్‌లోని జనావాసాలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని బీఎస్‌ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ్ అన్నారు. భారత్ ఎన్నడూ పాక్ జనావాసాలపై దాడి చేయలేదని పేర్కొన్నారు. పాక్ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సాధ్యమైనవన్నీ చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ఆగని పాక్ కాల్పులు
Published Thu, Nov 3 2016 3:01 AM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM
Advertisement