ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో సైనికుడు, పికప్ వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల (సీఎఎఫ్) వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు.
Chhattisgarh | Two Chhattisgarh Armed Force (CAF) security personnel died and one was injured after the vehicle they were travelling in overturned in the Balrampur district. The civil driver of the pick-up vehicle was also injured in the incident. Both the injured are under… pic.twitter.com/xVlVowxnop
— ANI (@ANI) June 20, 2024
Comments
Please login to add a commentAdd a comment