అట్టుడుకుతున్న హింస... ఉగ్రవాదుల కదలికలు... కల్లోలంగా మారిన కశ్మీర్‌ను కుదుట పరచడానికి భారత సైన్యం ఆపరేషన్ ‘కామ్ డౌన్’ను ప్రారంభించింది. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్‌లో 4,000 అదనపు జవాన్లను గుట్టుచప్పుడు కాకుండారంగంలోకి దింపింది. అయితే కనీస బలగాలను మాత్రమే ఉపయోగించాలని వారికి కచ్చితమైన ఆదేశాలున్నట్టు అధికారులు తెలిపారు.