
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పాలక బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పరస్పర ఆరోపణలు, దూషణల పర్వం తీవ్రస్ధాయికి చేరుకుంది. బీజేపీ అగ్రనేతలకు రూ 1800 కోట్ల ముడుపులు ముట్టాయని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. బీజేపీని విమర్శించేందుకు కాంగ్రెస్ నకిలీ డైరీ పత్రాలను చూపుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
యడ్యూరప్ప డైరీలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా చేస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తోసిపుచ్చిందని చెప్పారు. అసలు డైరీ ఒరిజినల్ పత్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. మీడియా కథనాల ఆధారంగా కాంగ్రెస్ తమ పార్టీపై బురదజల్లుతోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. యడ్యూరప్పను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమర్ధించారు. కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment