బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. హాంగ్ దిశగా అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వెల్లడించాయి ఈ నేపథ్యంలో కుమారస్వామి జేడీఎస్ మరోసారి కీలక కానుంది. ఎగ్జిట్‌పోల్స్ జేడీఎస్‌కు దాదాపు 20 స్థానాలకు పైగానే గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి.
ఈ క్రమంలో ఎగ్జిట్‌పోల్స్‌పై కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై స్పందించారు. తాజాగా బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌పోల్స్ వాస్తవ ఫలితాలు కాదు. కర్ణాటకలో మేమే గెలుస్తాం. రిసార్ట్ పాలిటిక్స్ అవసరం ఉండదు అని స్పష్టం చేశారు.
#WATCH | Exit polls are exit polls, it can't be 100% correct. We are going to get a complete majority and form the government. I think we should wait till 13th May: Karnataka CM Basavaraj Bommai #KarnatakaAssemblyElection
— Argus News (@ArgusNews_in) May 10, 2023
(ANI) pic.twitter.com/643rQa1pIM
మరోవైపు.. సీఎం భార్య చెన్నమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. 150కిపైగా స్థానాల్లో విజయం మాదే. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ 50వేలకు పైగా మెజార్టీ విజయం సాధిస్తారు అని అన్నారు.
ఇది కూడా చదవండి: కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్..
Comments
Please login to add a commentAdd a comment