బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ బాబురామ్ చించనసూర్.. బీజేపీకి రాజీనామా చేశారు. ఇక, మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే, నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బీజేపీ నేతలు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావ్ చించనసూర్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మెన్ బసవరాజ్ హొరట్టికి సమర్పించారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాబూరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని(ఎమ్మెల్యే) నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నిర్ణయానికి నో చెప్పడంతో పార్టీని వీడినట్టు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీని బాబూరావ్.. కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితమే బీజేపీ నేత పుట్టన్న కాషాయ పార్టీని వీడారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కర్నాటకలో బస్వరాజు బొమ్మై సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. బొమ్మై ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, మరో మూడు నెలల్లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ జోరుగా ప్రచారానికి ప్లాన్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు... 80 మందితో ఆప్ జాబితా
Comments
Please login to add a commentAdd a comment