బనశంకరి: సీఎం బొమ్మై నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో మొత్తం రూ.5.98 కోట్ల చరాస్తులు, రూ.22.95 కోట్ల స్థిరాస్తి కలిగి ఉన్నట్లు ప్రకటించారు. సొంత వాహనం లేదని, అయితే రూ.5.79 కోట్లు అప్పు ఉందని తెలిపారు. ఇక సతీమణికి ఎలాంటి స్థిరాస్తి లేదని, రూ.1.14 కోట్ల విలువచేసే చరాస్తి ఉన్నట్లు తెలిపారు. కుమార్తె పేరుతో రూ.1.28 కోట్ల చరాస్తులు ఉన్నాయి. తన చేతిలో రూ.3 లక్షల నగదు, భార్య వద్ద రూ.50,000 నగదు, కుమార్తె అదితి బొమ్మై వద్ద రూ.25,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. బొమ్మై పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.40 లక్షలకు పైగా డిపాజిట్లు, భార్య పేరుతో రూ.27.7 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. పలు కంపెనీల్లో రూ.3.23 కోట్లు పెట్టుబడి పెట్టగా, భార్య రూ.7 లక్షలు, కుమార్తె రూ.23 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు.
బొమ్మై వద్ద రూ. 1.50 కోట్ల బంగారు నగలు
బొమ్మై వద్ద రూ.1.50 కోటికి పైగా విలువచేసే బంగారు నగలు, భార్య వద్ద రూ.78.83 లక్షల విలువ చేసే నగలు, కుమార్తె వద్ద రూ.53.84 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. బొమ్మై పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.5.79 కోట్లు రుణం తీసుకున్నారు. బెంగళూరు యలహంక, హుబ్లీలో తలా ఎకరా వ్యవసాయేతర భూమి ఉంది. హుబ్లీలో 4 పొలం ఉంది, పలు నగరాల్లో వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. బెంగళూరు ల్యావెల్లి రోడ్డులో, ఆర్‌టీ.నగరలో ఇళ్లు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment