పెళ్లితంతు చేస్తున్న మహిళలు
యశవంతపుర: తుళునాడులో జరిగే విభిన్నమైన పెళ్లి వేడుక ఇది. వధూవరులు ఎవరో కంటికి కనిపించరు. అటు, ఇటు పెళ్లిపెద్దలు చేరి వేడుక జరిపించి ఆశీర్వదిస్తారు. కొత్త జోడీ ఎవరి కంటికి కనిపించకుండా తంతు ముగిసిపోతుంది. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో ఏటా ఒకసారి ప్రేతాత్మలకు వివాహం చేయడం ప్రజలకు ముఖ్యమైన ఆచారం. కరావళిలో ప్రస్తుతం తుళు మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు.
కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండా మరణించి ఉంటే వారికి ఇప్పుడు పెళ్లిళ్లు చేయడం ఇక్కడ సంప్రదాయం. తద్వారా మృతులకు పెళ్లి ముచ్చట తీరినట్లుగా భావిస్తారు. బంట్వాళ తాలూకా వగ్గ గ్రామం వధువు కుటుంబం, ఉళ్లాల తాలూకా కోణాజె సమీపంలోని చోళ్మ వరుని కుటుంబంగా ఏర్పడి ప్రేతాత్మలకు పెళ్లి చేశారు.
వగ్గ గ్రామానికి చెందిన సంజీవ పూజారి కుతూరు విశాలాక్షి రెండేళ్ల క్రితం మృతి చెందింది. చోళ్మలో లక్ష్మణ కొడుకు ధరణేశ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. వీరిద్దరూ అవివాహితులు కావడంతో ఇరు కుటుంబాలవారు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఇక ఈ పెళ్లిలో నాన్‌వెజ్ కూడా వండుతారు. చికెన్, మటన్‌తో పాటు చేపల ఫ్రై కూడా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment