Karnataka: డిప్యూటీ సీఎంగా శ్రీరాములు, ఆయనేమన్నారంటే.. | B Sriramulu To Be The Karnataka Deputy CM, Here Is Facts | Sakshi
Sakshi News home page

Karnataka: డిప్యూటీ సీఎంగా శ్రీరాములు, ఆయనేమన్నారంటే..

Published Fri, Jul 30 2021 8:18 PM | Last Updated on Fri, Jul 30 2021 9:00 PM

B Sriramulu To Be The Karnataka Deputy CM, Here Is Facts - Sakshi

మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీరాములు

సాక్షి, బెంగళూరు: నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్‌ బొమ్మై ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బళ్లారికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు పాల్గొనక పోవడంతో మీడియాల్లో పలు కథనాలు రావడంతో ఆయన స్పందించారు. తనకు పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదని, మూడుసార్లు మంత్రిని చేసిందని గుర్తు చేశారు. గురువారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ... ఇంట్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశానని, ఎవరిపైన ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.

తనకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేది లేనిది పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు విజయేంద్రను షాడో సీఎం అంటూ ప్రతిపక్షాలు మాట్లాడారని, ప్రస్తుతం బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపడితే యడియూరప్పను షాడో సీఎం అంటూ సంభోదిస్తున్నారని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement