
శివాజీనగర: రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం నూతన ముఖ్యమంత్రి అన్వేషణలో ఉందనే వార్తలను కర్నాటక సీఎం బసవరాజ బొమ్మై తోసిపుచ్చారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని, రానున్న ఎన్నికలు తన నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.
హైకమాండ్ పూర్తి సహకారం ఇచ్చిందని, పరిపాలనలో ఏ సీనియర్ నాయకుల జోక్యం లేదని, తాను ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదని చెప్పారు. మాజీ సీఎం యడియూరప్ప ప్రతిరోజు పరిపాలనలో మార్గదర్శనం చేస్తారు, అంతే తప్ప నిత్యం వేలు పెడతారనే విమర్శలు నిరాధారమైనవని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న హిందుత్వ, హత్య, అల్లర్లకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానలే కారణమని దుయ్యబట్టారు.
కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ చేసే అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదు, వీరి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ కాంట్రాక్టర్ల సంఘం నేతలందరూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మార్పిడి చట్టం అవసరమని, పార్టీ ఎమ్మెల్యే తల్లి మతం మారింది. అందువల్ల ఈ చట్టం అనివార్యమైందని, చట్టం వచ్చాక మత మార్పిళ్లు తగ్గాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment