కర్ణాటక సీఎం సిద్దరామయ్య సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. సభలోకి ఓ అగంతకుడు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఏం జరిగింది?
కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం సిద్ధరామయ్యకు శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ వ్యక్తి వేదికపైకి రాకముందే పోలీసు అధికారులు అతన్ని వెంటనే పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తి సిద్ధరామయ్య అభిమాని అని, శాలువతో సత్కరించాలని సీఎం వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా,సీఎం సభలో భద్రతా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా..అగంతకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అతను ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
📍बेंगलुरु
कर्नाटक के CM सिद्धारमैया की सुरक्षा में बड़ी चूक सामने आई है. दरअसल, एक कार्यक्रम के दौरान एक युवक भागते हुए उनके मंच पर पहुंच गया. जिसे कार्यक्रम में मौजूद सुरक्षाकर्मियों ने दबोचा लिया और मंच से नीचे उतारकर पुलिस के हवाले कर दिया.@siddaramaiah #Bengaluru… https://t.co/xKyZW4fVws pic.twitter.com/vDqbA1GEWf— Dainik Live (@Dainik_Live) September 15, 2024
ఇదీ చదవండి : టీ తాగేందుకు రావాలని వైద్యులకు దీదీ ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment