సాక్షి, బెంగళూరు(కర్ణాటక): తనదైన మార్కు చూపించేలా మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని సీఎం బసవరాజ బొమ్మై భావిస్తున్నారు. ఆయన సీఎం పీఠమెక్కి నాలుగు నెలలైంది. కేబినెట్లో సుమారు 8 మంది పనితీరు బాగాలేదని బొమ్మై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటివారిని సాగనంపి కొత్తవారిని తీసుకోవాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ఈ మార్పులు ఉండాలని అనుకుంటున్నారు.
పరిషత్ ఎన్నికల ముగియగానే
ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో 25 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాలు 14న వెల్లడిస్తారు. ఆ వెంటనే కేబినెట్లో మార్పులు చేర్పులు చేపట్టే అవకాశముంది. మొన్నటి సీఎం ఢిల్లీ పర్యటనలోనూ మంత్రుల మార్పు గురించి హైకమాండ్‌తో చర్చించారు.
ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలనేదానిపై నాయకత్వం నుంచి సూచనలు రాగానే పని ప్రారంభిస్తారు. పార్టీలో బలమైన నేతగా ఉన్న బీఎస్ యడియూరప్పను బుజ్జగించేలా ఆయన తనయుడు బీవై విజయేంద్రకు మంత్రివర్గంలో స్థానం కల్పించే ఆలోచన ఉంది.
చదవండి: ‘సినిమాలు తప్ప బాలకృష్ణకు ప్రజా సమస్యలపై ధ్యాసేలేదు.. ఆరు నెలలకోసారైనా..’
Comments
Please login to add a commentAdd a comment