కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. రంగంలోకి కేంద్రం | Karnataka Maharashtra Border Row Amit Shah Will Be Held With CMs | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర, కర్నాటక సీఎంలతో.. త్వరలో అమిత్‌ షా భేటీ

Published Sun, Dec 11 2022 9:02 AM | Last Updated on Sun, Dec 11 2022 9:02 AM

Karnataka Maharashtra Border Row Amit Shah Will Be Held With CMs - Sakshi

బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వచ్చే వారం భేటీ కానున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై శనివారం మీడియాకు ఈ విషయం చెప్పారు. ‘‘వివాదంపై తమ ప్రభుత్వ వైఖరి, వాస్తవాలను షాకు ఫోన్‌లో వివరించా. దీనిపై అఖిలపక్షం కూడా నిర్వహిస్తాం’’ అన్నారు.

మహారాష్ట్రలో విపక్ష కూటమి మహావికాస్‌ అగాడీ ఎంపీలు అమిత్‌ షాను కలవడం తెలిసిందే. ‘‘కర్నాటక బీజేపీ ఎంపీలు సోమవారం అమిత్‌ షాను కలవనున్నారు. నేనూ ఆయనతో మాట్లాడా. ఇరువురు సీఎంలతో సమావేశం నిర్వహిస్తానని షా చెప్పారు. డిసెంబర్‌ 14, లేదా 15 తేదీల్లో భేటీ ఉంటుంది’’ అని బొమ్మై వివరించారు.

ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement