సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎన్నికైన సీఎం కాదని, సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారనివిమర్శించారు. ఈ మేరకు బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బొమ్మై నియామకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారిందన్నారు.
‘డబ్బులిచ్చి ముఖ్యమంత్రి అయిన బొమ్మె ఎందుకు పనిచేస్తాడని, ఆయన్ను ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి వారి సూచనలను పాటించడం అతనికి సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగాలా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని, ఐదేళ్లపాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి 15 లక్షల ఇళ్లు కట్టించచినట్లు సిద్ధ రామయ్య తెలిపారు.
చదవండి: కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్?
కాగా రూ.2,500 కోట్లిస్తే సీఎం చేస్తామంటూ కొందరు తనను సంప్రదించారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ్ పాటిల్ ఇటీవలే ఆరోపించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment