నవీన్‌ మృతదేహం బెంగళూరుకి చేరనుంది: కర్ణాటక సీఎం | Body Of Indian Student Killed In Ukraine To Reach Bengaluru | Sakshi
Sakshi News home page

నవీన్‌ మృతదేహం బెంగళూరుకి చేరనుంది: కర్ణాటక సీఎం

Published Fri, Mar 18 2022 8:50 PM | Last Updated on Fri, Mar 18 2022 8:50 PM

Body Of Indian Student Killed In Ukraine To Reach Bengaluru  - Sakshi

సాక్షి బెంగళూరు: ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారతీయ విద్యార్థి మృతదేహం ఆదివారం బెంగళూరుకు చేరుకుంటుందని కర్ణాటక సీఎం ట్విట్టర్‌లో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా  ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఆఖరి సంవత్సరం వైద్య విద్యార్థి నవీన్ జ్ఞానగౌడర్ మార్చి 1న షెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే.  నవీన్‌ కుటుంబ సభ్యులు అతడి డెడ్‌ బాడీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొడుకును కడసారి చూడాలని పేరెంట్స్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు కూడా.

ఈ మేరకు నవీన్‌ తండ్రి కుమారుడి మృతదేహాన్నిఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు కూడా . ప్రభుత్వ కూడా వారికి హామీ ఇచ్చింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో షెల్లింగ్‌లో మరణించిన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ భౌతికకాయం ఆదివారం బెంగళూరుకు చేరుకుంటుందని శుక్రవారం తెలిపారు. నవీన్ మృతదేహానికి ఎంబామ్ చేసి ఉక్రెయిన్‌లోని మార్చురీలో ఉంచినట్లు బొమ్మై గతంలోనే తెలియజేశారు.

(చదవండి: బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌పై 200 మంది మూకుమ్మడి దాడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement