![Basavaraj Bommai Comments On Puneeth Rajkumar Death - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/29/puneeth-rajkumar12.jpg.webp?itok=JRDErRip)
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్ శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది.
(చదవండి: తారక్ నా సోదరుడు: పునీత్ పాత వీడియో వైరల్)
పునీత్ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం బొమ్మై మీడియాతో మాట్లాడారు. పునీత్ రాజ్‌కుమార్ యూత్ ఐకాన్ అన్నారు. ఈ సమయంలో ఆయన అభిమానులు శాంతించాలని సీఎం బొమ్మై విజ్ఞప్తి చేశారు. పునీత్‌ను కాపాడటానికి వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు. చిన్నవయసులోనే హార్ట్ ఎటాక్ రావడం చాలా అరుదు అన్నారు బొమ్మై.
(చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు)
ఈ నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్ పార్థీవ దేహాన్ని కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు. శనివారం తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పునీత్ కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటన ఆమె ఇండియా బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment