
న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ బొమ్మై తన మంత్రివర్గాన్ని బుధవారం సాయంత్రం ఐదింటికి విస్తరించనున్నారని వార్తలొచ్చాయి. 26 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడంలో తుది నిర్ణయం కోసం సీఎం బొమ్మై మంగళ వారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలుసుకున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ ఆవరణలో హోం మంత్రి అమిత్ షాను సైతం బొమ్మై కలుసుకున్నారని సమాచారం. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని 20–25 మందిని రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment