
ముంబై : మహారాష్ట్రాలోని పాల్గర్ జిల్లాలో జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. జెట్ ఎయిర్‌వేస్‌లో పని చేసే సీనియర్ టెక్నీషియన్ శైలేష్ సింగ్(45) నల్సోపోరాలో తాను నివాసముంటున్న నాలుగంతస్తుల బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శైలేష్ సింగ్ క్యాన్సర్‌తో బాధపడేవారని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా శైలేష్ తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డిప్రెషన్‌లో ఉండేవారని సహోద్యోగులు తెలిపారు. క్యాన్సర్ కారణంగా తరుచు కీమోథెరపీ చేపించుకోవాల్సి వచ్చేదని, ఇటీవల కాలంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎక్కువవ్వడంతో డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
జెట్‌ఎయిర్‌వేస్ సంక్షోభం కారణంగా ఉద్యోగులు జీతాలు అందక చాలా రోజులుగా ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. 26 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన జెట్ ఎయిర్‌లైన్ దిగ్గజం బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 22,000 మంది భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. ఇందులో 16,000 మంది డైరెక్ట్ ఉద్యోగులు కాగా, మరో 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment