Building collapse incident
-
విషాదం: భవనం కుప్పకూలి సజీవ సమాధైన కుటుంబం
ముంబై: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఓ భవనం కుప్పకూలి ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. అమరావతిలోని ప్రభాత్ సినిమా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాలను తొలగించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. భవనం కూలిపోయిన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ఇదీ చదవండి: తుపాకులతో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లిన దుండగులు -
మియామీ బిల్డింగ్ దుర్ఘటనలో కుట్ర కోణం.. జాన్ మెక్‌అఫీతో లింక్!!
ఫ్లోరిడా: మియామీలో బహుళ అంతస్తుల భవనం అపార్ట్మెంట్లు కుప్పకూలడం పెనువిషాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటికే శకలాల నుంచి ఐదు మృతదేహాల్ని వెలికి తీశారు. మరో 156 మంది ఆచూకీని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ విషాద ఘటనలో కుట్ర కోణం దాగుందని కొందరు భావిస్తున్నారు. టెక్ దిగ్గజం జాన్ మెక్‌అఫీతో ఈ ఘటనకు ముడిపెడుతూ.. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెక్అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ఈమధ్యే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిందే. అయితే చనిపోయే ముందు ఆయనొక ఇంపార్టెంట్ ట్వీట్ చేశాడని.. దానిని తెరమీదకు తెచ్చారు కొందరు. ‘‘నాకేదైనా జరిగితే.. ఫ్లోరిడా సర్ఫ్సైడ్ మియామీ బీచ్ కొల్లిన్స్ అవెన్యూలో ఉన్న కాంప్లెక్స్‌లో 31 టీబీ సైజులో ఉన్న ఫైల్స్ ఉన్నాయని, అందులో అమెరికా ప్రభుత్వపు అవినీతి సమాచారం ఉంద’ని ఆ ట్వీట్లో జూన్ 8న పేర్కొన్నాడాయన. ఆ తర్వాత వారానికి ఆయన చనిపోయాడు. మెక్అఫీ చనిపోయిన రెండు రోజులకే 55 అపార్ట్మెంట్లతో కూడిన మియామీ బిల్డింగ్‌లో 55 అపార్ట్మెంట్ల భాగం కుప్పకూలింది. దీంతో ఆయన చావుకి.. ఆ దుర్ఘటనకు సంబంధం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. ట్వీట్ ఫేక్? డిలీట్ చేశారా? నిజానికి మెక్అఫీ ఆ ట్వీట్ 2019లో చేశాడనేది కొందరి వాదన. ‘ప్రభుత్వ అవినీతికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. సీఐఏలో ఉన్న అవినీతి ఏజెంట్, ఇద్దరు బహైమన్ అధికారుల పేర్లతో ఆ చిట్టాను రిలీజ్ చేస్తా. నేను కనిపించకుండా పోయినా.. అరెస్టయినా 31 టెర్రాబైట్స్ ఉన్న డేట్.. మీడియాకు రిలీజ్ అవుతుందని చెబుతూ 2019లో ఓ ట్వీట్ చేశాడని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని జాన్ సిల్వా ఎన్బీసీటీ ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. అలాగే కుట్ర కోణంలో ఎలాంటి ధృవీకరణ లేదని, అసలు ఆ అపార్ట్మెంట్లో మెక్అఫీకి ఎలాంటి అపార్ట్మెంట్ లేదని వెల్లడించాడు. అయితే 2020కి ముందు మెక్అఫీ అకౌంట్లోని ట్వీట్లన్ని డిలీట్ అయ్యి ఉన్నాయి. మరి అవి ఆయన డిలీట్ చేశాడా? లేదంటే నిజంగానే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? నిజంగానే కుట్ర కోణం ఉందా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఐదు మృతదేహాల వెలికితీత ఇక మియామీ అపార్ట్మెంట్లో ఓ పోర్షన్ కుప్పకూలిన ఘటనలో ఐదు మృతదేహాలను రెస్క్యూ టీంలు వెలికితీశాయి. మరో 156 మంది ఆచూకీని నిర్ధారించాల్సి ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేకపోయినా.. భూమిలో సముద్రపు అలల వల్ల పునాదులు కొట్టుకుపోయాయని గతంలో నివేదికలు ఇచ్చాయని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రమాదపు కారణాల్ని దృవీకరించాల్సి ఉంది. చదవండి: మెక్అఫీ మరణం.. ముందే అనుమానించిన ఆమె -
తెలు‘గోడు’ పట్టదా?
బతుకుదెరువు కోసం ఊరు గానీ ఊరొచ్చిన తెలుగు వారు ప్రమాదంలో చిక్కుకుంటే పట్టించుకునే వారే లేరు. తెలుగు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటైన తెలుగు సంఘాలు కానీ, ఆ నాయకులు కానీ ఆ కూలీల చెంతకు కూడా రాలేదు. సన్మానాల, కోసం అవార్డుల కోసం మాత్రం పది మందిని వెంటేసుకుని పరుగులు తీస్తారు. కానీ తెలుగువారిని ఆదుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయూరు. సాక్షి, చెన్నై : చెన్నైలో తెలుగు సంఘాలకు కొదవ లేదు. కొన్ని సంఘాలు లెటర్‌ప్యాడ్ సంఘాలుగా ఉంటే, మరి కొన్ని తమ ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుంటాయి. ఇంకొన్ని సంఘాలు తెలుగు నినాదంతో తమ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నాయి. తెలుగు వాడికి, భాషకు అన్యాయం జరిగితే సహించం అన్నట్టుగా ఈ సంఘాల నాయకులు మైక్ చేతపట్టుకుని స్టేట్మెంట్లు ఇవ్వడం పరిపాటే. అయితే, ఇన్ని సంఘాలు ఇక్కడున్నా, మౌళివాకం ఘటన బాధితులకు తాము ఉన్నామంటూ భరోసా ఇవ్వడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం సిగ్గు చేటు. కావలసినవారికి అవార్డులు ఇచ్చుకుంటూ, సత్కారాలు చేసుకుంటూ పబ్లిసిటీ ఇచ్చుకునే సంఘాలు, బాధితులకు పట్టెడన్నం పెట్టేందుకు ముందుకు రాకపోవడం విచారకరం. దిక్కెవరు చెన్నైలో తెలుగు వారు అధికంగా ఉన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్లూ అధికం. తమిళనాట తెలుగుకు తామే ప్రతినిధులం అంటూ జబ్బలు చరిచే సంఘాలు, నాయకులకు కొదవ లేదు. అయితే వీరందరూ వ్యక్తిగత పబ్బం గడుపుకునేందుకే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు వారికి ఇక్కడ దిక్కెవరూ లేదన్న విష యం మౌళి వాకం ఘటన స్పష్టం చేస్తోంది. గోడు పట్టదా మౌళి వాకం ఘటనలో బాధితులు అత్యధికులు తెలుగువారే అన్న విషయాన్ని పదే పదే తమిళ మీడియాలు ప్రసా రం చేశాయి. తెలుగువారు ఈ ప్రమాదం కారణంగా పడుతున్న వెతల్ని తమ ప్రసారాల ద్వారా బయటకు తెస్తున్నా యి. సంఘటన జరిగిన క్షణంలో తమిళుడు, తెలుగు వాడు అన్న తేడా లేకుండా స్థానికులు వేలాదిగా తరలివచ్చి తమ వంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యారు. అలాగే ఎక్కడెక్కడ సంస్థల్లో, భవన నిర్మాణాల్లో కూలీలుగా పను లు చేస్తున్న వాళ్లు సైతం తమ ఊరోళ్లు ప్రమాదంలో చిక్కారేమో! అన్న అందోళనతో సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. సంఘటన జరిగి ఒక్క రోజు గడిచినా, ఆ పరిసర వాసులు అయ్యో... అన్న వేదనతో , అక్కడ ఏమి జరిగిం దో తెలుసుకోవడానికి కొందరు ఉరకలు తీశారు. అయితే, ఏ ఒక్క తెలుగు సంఘాల నాయకుడు కానీ అటు వైపు రాకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. స్పందన ఏదీ తెలుగువారిని ఆదుకునేందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచి రెడ్ క్రాస్ సిబ్బంది, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జేసీ రేఖా రాణి హుటాహుటిన వచ్చారు. అయితే, భాషాపరమైన సమస్యతో వారికి సహకరించే వాళ్లు లేక వారు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చివరకు తెలుగు మీడియాను తమిళ అధికారులు ఆశ్రయించక తప్పలేదు. ఓ వైపు భాషా సమస్య, మరో వైపు బాధితులు ఆకలి దప్పులతో అలమటిస్తుంటే కనీసం తమ వంతు సహకారం ఇచ్చే రీతిలో తెలుగు సంఘాలు స్పందించక పోవడం విచారకరం. కనీసం తెలుగు కోసం ఉద్యమిస్తున్న సంఘాలైనా, అక్కడికి వచ్చి బాధితుల్ని పరామర్శించలేదు. కేవలం టీవీల్లో ప్రమాద ఘటనను వినోదం చూసినట్టుగా చూశారన్న అపవాదును తెలుగు సంఘాలు మూటగట్టుకున్నారుు. అన్ని పార్టీల్లో తెలుగు నేతలు సైతం ఉన్నారు. తాము పలనా పార్టీ అంటూ ఎన్నికల సమయంలో పబ్లిసిటీకి ఎగబడే నాయకులకూ తెలుగు వాడి హాహాకారాలు వినపడకపోవడం శోచనీయం. బాధితులకు ఉంగలుక్కాగ చేయూత సాక్షి, చెన్నై: బహుళ అంతస్థుల భవనం కూలిన ప్రమాదంలో తెలుగు బాధితులకు ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించింది. ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సునీల్ సహాయకాలను అందజేశారు. మౌళి వాకం ప్రమాదంలో అత్యధికంగా తెలుగు బాధితులు ఉన్న విషయం తెలిసిందే. వీరిని ఆదుకునేందుకు ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులను ఆదుకుంటూ సహాయకాలను ఆదివారం సాయంత్రం పం పిణీ చేశారు. నగరంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త శశిధర్ రెడ్డి సహకారంతో 200 టవళ్లు, 300 బెడ్షీట్లు, 100 బ్యాగులు, వాటర్ ప్యాకెట్లు, మొత్తం రూ.1.5 లక్ష విలువ గల వస్తువులను బాధితులకు అందజేశారు. -
బాధ్యులెవరు?
నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు బాధ్యులు ఎవరన్న ప్రశ్న బయలు దేరింది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ, కోర్టుల చేత చీవాట్లు తింటున్న సీఎండీఏ ఈఘటనలో జాగ్రత్తగా వ్యవహరించే పనిలో పడింది. నిందలు తమ మీద పడకుండా ట్రస్ట్ హైట్స్‌కు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తోంది. ముందస్తు బుకింగ్ పేరిట ప్రైమ్ సృష్టికి లక్షల్లో అడ్వాన్స్‌లను అత్యధిక శాతం మంది చెల్లించినట్టు వెలుగులోకి వస్తోంది. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చేనా అంటూ బాధితులు గగ్గోలు సాక్షి, చెన్నై: పోరూర్ -కుండ్రత్తూర్ రోడ్డులోని మౌళివాకం సర్వే నెంబర్ 17/7ఎ,7ఇ,8ఎ,4ఎల్లోని మూడు వేల 986 చ.మీ స్థలంలో 11 అంతస్తులతో రెండు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు ప్రైమ్ సృష్టి సంస్థ సీఎండీఏలో దరఖాస్తు చేసుకుంది. ఫిబ్రవరి 15 -2012లో ఈ దరఖాస్తు రిజిస్టర్డ్ అయింది. ఆ దరఖాస్తును పరిశీలించిన చెన్నై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ) 2013 జూన్ మూడో తేదీన అనుమతి ఇచ్చింది. సీ-3/3120-2012 అన్న సంఖ్యలతో అనుమతి పత్రాన్ని సిద్ధం చేసి పంపించారు. రెండు దశలుగా చేపట్టనున్న ఈ నిర్మాణాల్లో మొదటి దశలో 44 గృహాలను, రెండో దశలో 42 గృహాలను నిర్మించేందుకు అనుమతి పొందింది. అనుమతి వచ్చే ముందే ఈ భవన నిర్మాణం చేపట్టారా? లేదా, ముందుగానే శ్రీకారం చుట్టారా? అన్న విషయం మాత్రం ప్రశ్నార్థకమే. అనుమతి పొందిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకుంటే, సరిగ్గా ఏడాదిలో రెండు దశల్లో 11 అంత్తుల భవనాన్ని నిర్మించేయడం ఆలోచించ దగ్గ విషయమే. మరి కొన్ని నెలల వ్యవధిలో ముందుగా రిజర్వు చేసుకున్న వారికి ఈ భవనాల్లో ఫ్లాట్స్‌ను కేటాయించనున్నారు. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడం ప్రజానీకాన్ని కలవరంలో పడేసింది. పిడుగు వంటి ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొనే విధంగా ఇక్కడ పరికరాలు అమర్చాల్సి ఉన్నా, ఆ దాఖలాలు మాత్రం లేవు. నిర్మాణం పూర్తయ్యాక ప్రమాదం జరిగి ఉంటే, ప్రాణ నష్టం ఏమేరకు ఉంటుందో ఊహించ లేని పరిస్థితి. పిడుగు పడితే... ఈ ప్రమాదానికి ముమ్మాటికి ప్రకృతి వైపరీత్యమే కారణం అని ప్రైమ్ సృష్టి సంస్థ వాదిస్తోంది. అరుుతే పిడుగు పడ్డ దాఖలాలు మాత్రం కానరాలేదని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒక వేళ పిడుగు పడ్డా, పైన ఉండే ఒకటి రెండు అంతస్తులుదెబ్బ తింటాయని చెబుతున్నారు. దీంతో సీఎండీఏ వర్గాల్లో మాత్రం గుబులు మొదలైంది. అధికారుల చేతి వాటం, నిర్లక్ష్యం ఇందులో వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు, కోర్టులతో చీవాట్లు పెట్టించుకున్న సీఎండీఏకే తాజా ఘటన ఓ అగ్ని పరీక్షే. తాము అన్నీ నిబంధనల్ని ముందుగానే పరిశీలించి, ఆ సంస్థకు అనుమతి ఇచ్చామా? అన్న దిశగా ముందుకు వెళుతున్నారు. ప్రైమ్ సృష్టి సమర్పించిన రికార్డులను, నమూనాలను, అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ సిద్ధం అవుతోంది. తాము మాత్రం ఈ ఘటనకు బాధ్యులు కాకూడదన్న దిశగా సీఎండీఏ వర్గాలు కుస్తీలు పడుతోంటే, ఈ ఘటనకు బాధ్యులెవ్వరన్న ప్రశ్నకు సమాధానం దొరికేనా అన్నది వేచి చూడాల్సిందే. నిపుణులు కరువు : అత్యాధునిక టెక్నాలజీని భవన నిర్మాణ సంస్థలు అందిపుచ్చుకుని ఉరకలు తీస్తున్నాయి. సీఎండీఏ వద్ద అనుమతులు పొందేందుకు సమర్పించాల్సిన దరఖాస్తులో అన్ని వివరాలను సంబంధిత సంస్థ పొందు పరచాల్సి ఉంది. నమూనా వివరాలను ఆర్కిటెక్స్, భూ సామర్థ్యం గురించి సంబంధిత ప్రైవేటు ఇంజనీరింగ్ నిపుణులు సర్టిఫికెట్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ రికార్డులను పరిశీలించేంత సాంకేతిక నిపుణులు సీఎండీఏలో లేరన్నది జగమెరిగిన సత్యం. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని భవన నిర్మాణ సంస్థలు, కొత్త టెక్నాలజీల పేరుతో ప్రైవేటు ఆర్కిటెక్స్, ఇంజనీర్ల వద్ద సర్టిఫికెట్లను తెప్పించుకుని సీఎండీఏను బురిడీకొట్టిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నివేదికసిద్ధం చేసే పనిలో సీఎండీఏ వర్గాలు ఉండడం గమనార్హం. లక్షల్లో అడ్వాన్స్: ప్రైమ్ సృష్టి సంస్థ ట్రస్ట్ హైట్స్ పేరిట చేపట్టిన రెండు ప్రాజెక్టులకు భారీగానే అడ్వాన్స్‌లను రాబట్టింది. 755 నుంచి 1115 చ.అడుగుల విస్తీర్ణాల్లో ప్లాట్లను నిర్మించే పనిలో పడింది. ఒక్కో ప్లాట్‌కు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ధర నిర్ణయించి ఉన్నారు. 86 ప్లాట్లకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. నగరానికి చెందిన అనేక మంది ఉద్యోగులు, వ్యాపారులు సొంతింటి కలను సాకారం చేసుకునే రీతిలో తమకు కావాల్సిన ప్లాట్స్‌ను ఎంపిక చేసుకుని అడ్వాన్స్ బుకింగ్‌లు చేసి ఉన్నారు. అంతేకాకుండా సృష్టి సంస్థ దగ్గరుండి అడ్వాన్స్ బుకింగ్ దారులకు బ్యాంక్ రుణాలను కూడా మంజూరు చేయించినట్టు సమాచారం. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. తాము చెల్లించిన అడ్వాన్స్‌లు మళ్లీ దక్కేనా అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. తమ సొమ్ముకు బాధ్యులు ఎవరో అంటూ గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా భవన నిర్మాణ సంస్థలు ప్రకృతి వైఫల్యాలు ఎదురయితే, నష్ట పరిహారం రాబట్టుకునేందుకు ముందుగా తాము చేపట్టే ప్రాజెక్టులకు ఇన్సూర్ చేయడం సహజం. అయితే, ఇక్కడ ఆ ప్రయత్నం జరిగిందా? అన్నది ప్రశ్నార్థక మే. దీంతో తమ అడ్వాన్స్‌లు తిరిగి దక్కేనా అన్న మనో వేదనలో ముందస్తు రిజర్వ్డ్ చేసుకున్న బాధితులు ఉన్నారు.