సాక్షి, హైదరాబాద్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే పాతబస్తీలో ఇల్లు కూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా పాతబస్తీలో ఓ మహిళకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.
(చదవండి : రోడ్లన్నీ జలమయం.. హై రెడ్ అలర్ట్)
ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె పక్కనే శిథిలావస్థలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో మహిళ భయంతో పక్కకి జరిగి పరుగులు తీసింది. లేదంటే ఇంటి గోడ కూలి ఆమె మృతి చెందేది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అనంతరం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకొని పాత భవనాన్ని పరిశీలించారు.
(చదవండి : వరద బీభత్సానికి అద్దం పడుతున్న దృశ్యం)
Comments
Please login to add a commentAdd a comment