patha basthi
-
పాతబస్తీలో కొనసాగుతున్న పోలీసుల గస్తీ
-
పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ పలకరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు నియోజకవర్గాల్లో మరో రెండేళ్లలో మురుగు అవస్థలు తీరనున్నాయి. మూసీకి ఉత్తరం వైపున మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ పనులకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. జలమండలి పరిధిలో జోన్– 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పూర్తితో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి మురుగు తిప్పలు తప్పనున్నాయి. సుమారు రూ.297 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 129.32 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. పాతనగరంలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టును జలమండలి చేపట్టింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను షా కన్సల్టెన్సీ (ముంబై) రూపొందించింది. ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. ► జోన్– 3 మురుగు నీటిపారుదల వ్యవస్థలో తొమ్మిది పరీవాహక ప్రాంతాలు ఉంటాయి. మొత్తం 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎన్ 1 నుంచి ఎన్ 7 వరకు, ఎన్ 11, ఎన్ 31 పరీవాహక ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 355.78 కిలోమీటర్ల పొడవైన సీవరేజ్ నెట్వర్క్ ఉంది. ►ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.297 కోట్లు. ►నెట్వర్క్ మొత్తం పొడవు: 129.32 కి.మీ. ► ఆర్సీసీ ట్రంక్ సీవర్స్ పైప్లైన్లు: 400–1200 ఎంఎం డయా: 36.14 కి.మీ. ►ఎస్‌డబ్ల్యూజీ నెట్వర్క్ 200–300ఎంఎం డయా: 93.18 కి.మీ. ►మురుగు ప్రవాహం అంచనా: 2036 నాటికి: 127.42 ఎంఎల్డీ. ► 2051 నాటికి : 153.81 ఎంఎల్డీ. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్స్ (కొంత భాగం), మెహిదీపట్నం, నానల్‌నగర్, ఆసిఫ్ నగర్, విజయ్‌నగర్ కాలనీ, ఎన్ఎండీసీ కాలనీ, మాసబ్ ట్యాంక్, రెడ్ హిల్స్, లక్డీకాపూల్, బజార్‌ఘాట్, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్. ప్రయోజనాలు: సీవరేజీ వ్యవస్థ పరిధి పెరుగుతుంది. ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేకరణ జరుగుతుంది. నాలాల్లోకి, మూసీ నదిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండదు. మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సివరేజ్ పనులను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ మేం జీతాలు పెంచాం.. మోదీ ధరలు పెంచారు బహదూర్‌పురా: పాతబస్తీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మీరాలం ట్యాంక్ వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. దీంతో వారు తమ జీతాలు పెంచాల్సిందిగా ఆయనను కోరారు. స్పందించిన కేటీఆర్.. రాష్ట్రం వచ్చేనాటికి రూ.8 వేలున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్ని సీఎం కేసీఆర్ దఫదఫాలుగా రూ.17 వేలకు పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని వారు చెప్పగా, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమన్నారు. మేం జీతాలు పెంచుతూ ఉంటే.. మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సివరేజీ పనులకు శ్రీకారం గోల్కొండ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకిలో రూ. 297 కోట్లతో చేపట్టిన సివరేజీ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సివరేజ్ లైన్ పనులు పూర్తయితే ఎన్నో బస్తీలకు వరద ముంపు తప్పుతుందన్నారు. షేక్‌పేట్‌లో రూ. 333 కోట్లతో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించినట్లు చెప్పారు. సెవన్ టూంబ్స్ చౌరస్తా నుంచి గోల్కొండ వరకు రోప్‌వే కోసం ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తాము ప్రతిపాదించిన పనులకు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎంఎన్ ప్రభాకర్, కార్పొరేటర్లు మహ్మద్ నసీరుద్దీన్, రాషెఫ్ ఫరాజుద్దీన్, టీఆర్ఎశ్ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి టి.జీవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
Chiranjeevi: పాత బస్తీలో ‘బోళా శంకర్’ ఫైట్?
పాత బస్తీలో తన ప్రతాపం చూపించనున్నాడు శంకర్. విజువల్‌గా ఈ ఫైట్ ఎలా ఉంటుందనేది వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై తెలుస్తుంది. చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బోళా శంకర్’. ఇందులో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ నేతృత్వంలో హైదరాబాద్‌లో పాతబస్తీ సెట్ వేశారు. ఈ సెట్లో చిరంజీవిపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ నెల 15న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం ఈ నెల 20న షూట్లో జాయిన్ అవుతారని తెలిసింది. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని టాక్. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేశ్, హీరోయిన్గా తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్. -
మళ్లీ జడివాన
సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభా వంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి పొద్దు పోయే వరకు కుండపోతగా జడి వాన కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో నగరం నిండా మునిగింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువు లను తలపించాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పలు బస్తీలలో ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడ్డారు. రాంగోపాల్‌పేట నల్లగుట్టలో నీటమునిగిన కాలనీ ప్రధాన రహదారులపై రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. దిల్సుఖ్నగర్ పరిధిలోని లింగోజి గూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాత్రి 9 గంటల వరకు కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.83, ఆస్మాన్‌ఘడ్ 8.75, ఎల్బీనగర్ 8.58, కంచన్‌బాగ్ 8.40, చందూలాల్ బారాదరిలో 8.13, రెయిన్ బజార్ 7.73, జహానుమా 7.65, అత్తాపూర్ 6.90, రాజేంద్రనగర్ 6.68, మలక్‌పేట 6.43, మెహిదీపట్నంలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చైతన్యపురి ప్రధాన రహదారిలో వర్షపు నీరు -
ఏడేళ్లలో పాతబస్తీ అభివృద్ధికి రూ. 14,887 కోట్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. పాతబస్తీ అభివృద్ధికి ఏడేళ్లలో రూ. 14,887 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఖర్చు చేసిన మొత్తం రూ. 3, 934 కోట్లు మాత్రమేనని అన్నారు. సోమవారం శాసనసభలో పాతబస్తీ అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్న విపక్ష నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క,, రాజాసింగ్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాత నగరంలో ఇప్పుడు జరిగినంత అభివృద్ధి గతంలో ఎన్నడూ లేదన్నారు. చదవండి: మొక్కల కన్నా ముస్లింలు హీనమా? పాత బస్తీ అభివృద్ధికి జీహెచ్ఎంసీ ద్వారా రూ. 9,899 కోట్లు,, వాటర్‌బోర్డు ద్వారా రూ. 3,784 కోట్లు కాగా, ఇతర ఐదు శాఖల నుంచి మరో 1,193 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. హైదరాబాద్ విస్తరించుకుంటూ పోతుందని, పాత నగరం 102 చదరపు కిలోమీటర్ల పరిధి ఉండగా, ప్రస్తుతం అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం 675 చ.కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. పెరిగిన హైదరాబాద్‌తో పాటు పాత నగరాన్ని కూడా ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) కింద పాతబస్తీ రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ. 456 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్లు తెలిపారు. సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్టు (సీఆర్ఎంపీ) కింద 154 కిలోమీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి కోసం రూ. 118 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. చదవండి: మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త అందాలు పాతబస్తీ పరిధిలోని 8 నియోజకవర్గాల్లో సీఆర్ఎంపీ, ఎస్ఆర్డీపీ ల కింద ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అదనంగా రెగ్యులర్ రోడ్డు ఇంప్రూవ్‌మెంటు కింద మరో రూ. 63 కోట్లతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న రోడ్లకు భూసేకరణ కోసమే రూ. 494 కోట్లు ఖర్చు చేశామన్నారు. కొత్తగా 9 రహదారులను కూడా విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.మూసీ నది మీద 14 కొత్త బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించామని, త్వరలో ఈ పనులు మొదలవుతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: బాబోయ్..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది! నాలాల అభివృద్ధి పనులు గత సంవత్సరం వచ్చిన వరదలతో మూసీ వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా రూ. 19.30 కోట్లతో నిర్మించనున్నట్లు చెప్పారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ) కింద చార్మినార్ చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సర్ధార్ మహల్ అభివృద్ధి, కిల్వత్ దగ్గర మల్టీ లెవల్ పార్కింగ్ , లాడ్ బజార్‌కు మెరుగులు వంటి పనులు చేయాల్సి ఉందన్నారు. నాలాల అభివృద్ధి పనులు వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ) కింద చేపట్టినట్లు చెప్పారు. 10 కిలోమీటర్ల మురికినాలను విస్తరించే పథకం కింద ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల మేర 3వేల ఆక్రమణలను తొలగించామని, మరో 2 కిలోమీటర్ల విస్తరణ మిగిలి ఉందన్నారు. చదవండి: Telangana Assembly: ప్రతీకార రాజకీయాలను నమ్మం.. ప్రస్తుతం రూ. 242 కోట్లతో ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు నడుస్తుందన్నారు. మొదటి దశలో రూ. 858 కోట్లు సిటీలో ఇందుకోసం వెచ్చిస్తుండగా, పాతబస్తీకే రూ. 261 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పాతబస్తీలో నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పీఎం స్వనిధి పథకం కింద పాతబస్తీలో 38,4/99 మంది స్ట్రీట్ వెండర్స్‌ను గుర్తించామని, వీరందరికి రూ. 10 వేల చొప్పున కేంద్రం రుణం ఇస్తుందని అన్నారు. వైద్యం, విద్యకు సంబంధించి ఎంతో చేశామని, బస్తీ దవాఖానాల ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచి్చనట్లు చెప్పారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా పాతబస్తీలో ఆసుపత్రులలో ప్రసవాలు 68 శాతం పెరిగిందని అన్నారు. ఓల్డ్‌సిటీకి మెట్రో వస్తుంది... పాతబస్తీకి మెట్రోను తీసుకురావడంలో జరిగిన ఆలస్యానికి కోవిడ్ విజృంభన కారణమని మంత్రి కేటీఆర్ చెప్పారు. పాతబస్తీలో మెట్రోకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధ్యక్షతన ఓ కమిటీ వేశారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. త్వరలోనే మెట్రో పాతబస్తీలో పరుగులు పెడుతుందన్నారు. కుతుబ్‌షాహీ టూంబ్స్కు ప్రపంచ గుర్తింపు రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని , అదే తరహాలో హైదరాబాద్ నగరానికి కూడా ఓ అంతర్జాతీయ గుర్తింపు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కుతుబ్‌షాహీలకు చెందిన ఏడు సమాధులకు కూడా ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేందుకు , తద్వారా పర్యాటకంగా హైదరాబాద్‌ను ఉన్నత స్థితికి తీసుకురానున్నట్లు చెప్పారు. విపక్ష ఎమ్మెల్యే ఉన్నా... ములుగును జిల్లా చేశాం.. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు కారు గుర్తు ఎమ్మెల్యేనా... కార్వాన్ ఎమ్మెల్యేనా అని చూడడం లేదని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా కేంద్రం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినా... ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగును జిల్లా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. -
పాతబస్తీలో కాషాయజెండా
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. బీజేపీ భారతీయుల పార్టీ, అన్ని వర్గాల వారిని గౌరవిస్తుంది. ముస్లిం మహిళల మేలు కోరే త్రిపుల్ తలాఖ్‌ను మోదీ రద్దు చేశారు. దేశం కోసమే 370 ఆర్టికల్‌ను రద్దు చేశారు. అధికారంలో ఉండే పార్టీకి తొత్తులా మారి అసదుద్దీన్ పబ్బం గడుపుకుంటున్నారు. హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించి లబ్ధిపొందడం మజ్లిస్ పార్టీకే చెల్లింది. పాతబస్తీలో మజ్లిస్ ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొన్నందువల్లే ఆలె నరేంద్రను టైగర్‌గా, బద్దం బాల్‌రెడ్డిని గోల్కొండ సింహంగా ప్రజలు పిలుచుకున్నారు. మజ్లిస్ గూండాగిరి కారణంగానే నందరాజ్ గౌడ్, పాపన్నలు బలయ్యారు. – గోల్కొండlసభలో బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పాతబస్తీ నుంచి మజ్లిస్‌ను తరిమికొట్టి కాషాయ జెండాను ఎగరేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పునరుద్ఘాటించారు. నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలన విముక్తే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’రెండో రోజైన ఆదివారం మెహిదీపట్నం, షేక్‌పేట్, గోల్కొండ కోట మీదుగా సాగింది. ఈ సందర్భంగా షేక్‌పేట్ నాలా వద్ద సభలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులను పెంచిపోషిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాతబస్తీలో ఉండే ప్రతి హిందువు ధైర్యంగా ఉండాలని సూచించారు. వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెట్రో, ఎంఎంటీఎస్ సేవలను పాతబస్తీకి విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు. తద్వారా ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. 2023 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తామని, మొదటి సభను భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తన యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ అధినేతలకు నిద్రపట్టడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతోందని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని అన్నారు. యాత్ర ఇన్చార్జ్ కోలార్ ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి రూ.65 వేల కోట్ల అప్పులు ఉండేవని, ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని విమర్శించారు. పూల వర్షం కురిపిస్తూ... మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో శనివారం రాత్రి బస చేసిన సంజయ్ ఆదివారం ఉదయం యాత్రను ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ.. బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల నుంచే కాకుండా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యాదవ సంఘాలకు చెందిన కొందరు యువకులు దున్నపోతులను తెచ్చి వాటిపై సవారీ చేస్తూ యాత్రలో అందరి దృష్టిని ఆకర్షించారు. -
అన్నతో ఎంగేజ్మెంట్, తమ్ముడితో పెళ్లి.. ఆపై ఆత్మహత్య
హైదారాబాద్: పెళ్లయి నెల గడవక ముందే ఓ యువతి జీవితం బలైపోయింది. తన ప్రమేయం లేకుండానే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో ఒకరితో ఎంగేజ్మెంట్, మరొకరితో వివాహం చివరికి ఆ యువతిని బలికొంది. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.. పాతబస్తీకి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్‌తో జల్పల్లి న్యూ బాబానగర్‌కు చెందిన మీర్ ఇస్మాయిలుద్దీన్ అలీకి గత నెల 12న పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితమే ఇస్మాయిలుద్దీన్ వివాహం చేసుకున్న షాహిన్భేగంకు తన అన్నయ్య జలాలుద్దీన్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్నాళ్ళకి ఉపాధి నిమిత్తం అన్నదమ్ములిద్దరూ దుబాయికి వెళ్లారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వివాహం చేసుకునేందుకు జలాలుద్దీన్ దుబాయి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అయితే కొద్ది రోజుల క్రితమే తన తమ్ముడు ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తిరిగి తన స్వస్థలం చేరుకున్నాడు. ఇది ఇలా ఉండగా దుబాయ్‌లో జలాలుద్దీన్ ఆచూకి తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులకు ఎదురైంది. దీనితో తప్పని పరిస్తితుల్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్‌ను ఇస్మాయిలుద్దీన్ అలీకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత జులై నెల 12న వారిరువురికి వివాహం జరిపించారు. అయితే ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ షాహిన్‌ను రోజూ హింసించసాగాడు. తన అన్న ఎంతో ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్న యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేశారంటూ ఇస్మాయిలుద్దీన్ తీవ్రంగా ఆలోచించేవాడు. అంతేకాక తన అన్నకు భార్యగా ఉండాల్సిన యువతిని తన భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇరు కుటుంబాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే షాహిన్‌కు అత్తమామల నుంచి సైతం వేదింపులు మొదలయ్యాయి. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన షాహిన్ బేగం గత శనివారం తన గదిలో ఉన్న ఫాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే షాహిన్ బేగం మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం
-
హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించావ్.. పెళ్లి చేస్కో అని ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధీనా నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌కు చెందిన రాధిక, పాతబస్తీకి చెందిన ముస్తాఫా ప్రేమించుకున్నారు. కాగా, శనివారం రాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లిన రాధిక.. ప్రేమించావు పెళ్లి చేస్కో అని ముస్తాఫాను నిలదీశారు. ఈ క్రమంలో ముస్తాఫా కుటుంబ సభ్యులకు, రాధికకి మధ్య గొడవ జరిగింది. అర్థరాత్రి తర్వాత ముస్తాఫా, అతని సోదరుడు జమిల్ కలిసి రాధికని దారుణంగా హత్య చేశారు. కత్తితో యువతిని పొడిచి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులకు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అనంతరం నారాయణ ఖేడ్‌కు పంపిచారు. -
భారీ వర్షం.. క్షణాల్లో కుప్పకూలిన భవనం
సాక్షి, హైదరాబాద్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే పాతబస్తీలో ఇల్లు కూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా పాతబస్తీలో ఓ మహిళకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. (చదవండి : రోడ్లన్నీ జలమయం.. హై రెడ్ అలర్ట్) ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె పక్కనే శిథిలావస్థలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో మహిళ భయంతో పక్కకి జరిగి పరుగులు తీసింది. లేదంటే ఇంటి గోడ కూలి ఆమె మృతి చెందేది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అనంతరం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకొని పాత భవనాన్ని పరిశీలించారు. (చదవండి : వరద బీభత్సానికి అద్దం పడుతున్న దృశ్యం) -
హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఘాన్సీబజార్ డివిజన్‌కు చెందిన రవి అలియాస్ పీటర్ రవిని ముగ్గురు దుండగులు నడిరోడ్డుపై నరికి చంపారు. ఈ ఘటన చార్మినార్ పరిధిలోని భగ్వాన్ దేవి ఆసుపత్రి పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దారుణ హత్యా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పాతకక్షలే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
పాతబస్తీలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాపూల్‌లో బుధవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని షకీల్ ఖురుషీగా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. తన తల్లి, చెల్లిని అత్యాచారం చేసి చంపుతానని వేధింపులకు దిగడంతోనే ఓ పథకం ప్రకారం అబ్దుల్ ఖాజా ఈ హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ దారుణం జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉండటం గమనార్హం. కత్తితో ఖురుషీని అబ్దుల్ ఖాజా అతి కిరాతకంగా నరుతున్నప్పుడు అక్కడున్న వారందరూ చోద్యం చూశారే తప్ప ఎవరూ అడ్డుకొనే సాహసం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు ఖాజాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నెల క్రితం చోటుచేసుకున్న అత్తాపూర్ ఘటన మరవక ముందే నడి రోడ్డుపై మరో వ్యక్తి దారుణ హత్య నగరంలో కలకలం రేపుతోంది. -
డాక్యుమెంట్స్ లేని వాహనాలు సీజ్
-
వైన్ షాప్ వద్ద హిజ్రా హల్చల్
హైదరాబాద్ : రోజురోజుకు హిజ్రాల ఆగడాలకు అదుపులేకుండా పోతోంది. తాజాగా పాతబస్తీలోని షంషీర్ గంజ్‌లో గురువారం ఓ హిజ్రా హల్చల్ చేసింది. అక్కడే ఉన్న మహాలక్ష్మి వైన్స్ వద్దకు వెళ్లి రూ.1100 డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే చీర విప్పేస్తానంటూ బెదిరించింది. వైన్స్ యజమాని రూ.500 ఇస్తే తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో యజమాని సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ దాదాపు 40 నిమిషాల పాటు సర్దిచెప్పారు.. అయినా వారి మాట వినకుండా అక్కడే తిష్ట వేసింది. పోలీసులకు కూడా ఏమి చేయాలో దిక్కు తోచక బిక్కమొఖం వేశారు. -
మతం మార్చుకున్నందుకు బెదిరిస్తున్నారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇస్లాం మతాన్ని స్వీకరించిన హిందూ మతానికి చెందిన ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని న్యాయవాది షేక్ సైఫుల్లా ఖాన్ ఖలీద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మొఘల్‌పురాలోని డీజేఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మియాపూర్ స్వర్ణపురి కాలనీలో నివాసం ఉండే బంగారం వ్యాపారి బాబులాల్ చౌదరి కుమార్తె చంద్రకాంత (19) ఇస్లాం మతానికి ఆకర్షితురాలయ్యారన్నారు. దీంతో గతేడాది అక్టోబర్ 7న నగరంలోని ఆలిండియా మజ్లీస్ తమీర్-ఇ-మిల్లత్‌లో ఇస్లాంను స్వీకరించిందన్నారు. దీనిపై స్టేట్ వక్ఫ్‌బోర్డును ఆశ్రయించగా అక్టోబర్ 19న ఇస్లాం మతం స్వీకరించినట్లు రిజిస్ట్రర్ చేసి జైనాబ్ ఫాతీమా పేరు మీద సర్టిఫికెట్ జారీ చేశారన్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు హిందూ మతానికి చెందిన వ్యక్తితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. దీంతో చంద్రకాంత ఆలియాస్ జైనాబ్ ఫాతిమా డిసెంబర్ 11న ఇంట్లో నుంచి బయటికి వచ్చిందన్నారు. ఇదిలాఉండగా తమ కూతురు కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు రాంచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో డిసెంబర్ 12న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారన్నారు. అయితే కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ డిసెంబర్ 16న మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిందన్నారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ జైనాబ్ ఫాతిమాకు రక్షణ కల్పించాలని ఆదేశించిందన్నారు. జైనాబ్ ఫాతిమా తన ఇష్టంతో డిసెంబర్ 31న ఇస్లాం మతానికి చెందిన ఓ యువకున్ని వివాహం చేసుకొని పాతబస్తీలోని షాహిన్‌నగర్‌లో ఉంటుందన్నారు. జైనాబ్ ఫాతిమాను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జైనాబ్ ఫాతిమా మాట్లాడుతూ ఇస్లాం మతంపై ఆకర్షితురాలై మత మార్పిడి చేసుకున్నానని తెలిపారు. అదే మతానికి చెందిన తనకిష్టమైన వ్యక్తితో వివాహం జరిగిందని చెప్పారు. తమ కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కిడ్నాప్ కేసు నమోదైంది తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే బంగారం వ్యాపారి బాబులాల్ చౌదరి కూతురు కిడ్నాప్‌నకు గురైందని కుటుంబ సభ్యులు గతేడాది డిసెంబర్ 12న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని రామచంద్రాపురం ఇన్స్పెక్టర్ ఆర్. శ్రీనివాసులు తెలిపారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా విషయం తెలిసిందన్నారు. చంద్రకాంత ఆలియాస్ జైనాబ్ ఫాతిమా మేజర్ కావడంతో దీని ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.