
పాత బస్తీలో తన ప్రతాపం చూపించనున్నాడు శంకర్. విజువల్‌గా ఈ ఫైట్ ఎలా ఉంటుందనేది వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై తెలుస్తుంది. చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బోళా శంకర్’. ఇందులో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ నేతృత్వంలో హైదరాబాద్‌లో పాతబస్తీ సెట్ వేశారు. ఈ సెట్‌లో చిరంజీవిపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.
ఈ నెల 15న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం ఈ నెల 20న షూట్‌లో జాయిన్ అవుతారని తెలిసింది. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని టాక్. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేశ్, హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్.
Comments
Please login to add a commentAdd a comment