
చండీగఢ్: పంజాబ్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొహాలి జిల్లాలోని డేరా బస్సీలో గురువారం ఉదయం ఒక భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తెలిపాయి. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు వెల్లడించాయి. వారిని వెలికి తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment