ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం నెలకొంది.
మీరట్ : ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం నెలకొంది. మీరట్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో అక్రమంగా నిర్మించిన భవనాల తొలగింపు సందర్బంగా ఒక భవనం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కాగా సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేతలను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.