
గుంటూరు: ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలగా తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. గుంటూరు నగరంలోని నందివెలుగు రోడ్డులో మణి హోటల్ వద్ద ఓ మూడంతస్తుల (జీ ప్లస్ 3) భవనం ఉంది. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ భవనం ముందు భాగాన్ని అధికారులు తొలగించారు. రోడ్డు విస్తరణలో శనివారం పొక్లైనర్లతో కాలువలు తీస్తుండగా మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మున్సిపల్ సిబ్బంది నోటీసులు ఇవ్వడంతో ఇంటి యజమానులు అప్పటికే ఇంటిని ఖాళీ చేయడంతో ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేదు. కాగా భవనం కూలిన దృశ్యాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment