
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకకాండ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకకాండ నడుస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ యువకార్యకర్త రషీద్ హత్య అత్యంత కిరాతకం. ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతోనే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయి. నామీద కూడా దాడులు చేశారు. గతంలో యాక్టివ్‌గా పని చేసిన నేతలందరినీ టీడీపీ టార్గెట్ చేసింది.
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటి?. ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?. పార్లమెంటులో వీటిపై చర్చిస్తాం. దేశమంతా ఏపీలోని దారుణాల గురించి విస్తుపోతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఎందుకు నోరుమెదపటంలేదు?.

.. బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీపై దాడులపై ఢిల్లీలో ధర్నా చేయనున్నారు.దేశమంతా ఏపీలోని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై చర్చించేలా చేస్తాం’ అని అన్నారు.
చదవండి: మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment