వినుకొండ (గుంటూరు) : కల్తీ మద్యానికి మరో వ్యక్తి బలయ్యాడు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొప్పకొండ గ్రామానికి చెందిన నూలి సుబ్బయ్య(40) శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ బెల్ట్ షాపులో మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. కల్తీ మద్యం తాగడం వల్లే సుబ్బయ్య మృతిచెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.