సాక్షి, వినుకొండ : వైఎస్సార్ స్ఫూర్తి తో పుట్టిన వైఎస్సార్ సీపీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పాటుపడుతుందని పార్టీ నాయకుడు బొత్స సత్యనారయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే థ్యేయంగా వైఎస్సార్ పని చేశారని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుని చంద్రబాబు వ్యక్తిగత అభివృద్ధి కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తల సమావేశంలో బొత్స ప్రసంగించారు.
2014 సాధారణ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికి వదిలేశారని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందుతాయని చెప్పారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై పోరాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment