వినుకొండ (గుంటూరు) : బస్టాండ్ టాయిలెట్లో విద్యుత్ షాక్‌కు గురై మహిళ మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ బస్టాండ్‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన ఏసమ్మ అనే మహిళ వినుకొండ బస్టాండ్‌లోని టాయిలెట్కు వెళ్లగా విద్యుత్‌షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించింది. టాయిలెట్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో మృతురాలి బంధువులు ఆందోళన నిర్వహించారు.