
సాక్షి, పల్నాడు జిల్లా: సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లకు పాల్పడిన టీడీపీ నేతలు మరోసారి వైఎస్సార్ సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కంచి శ్రీనివాసరావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి మొదలైంది.
ఎస్పీ స్వయంగా వినుకొండలో ఉన్న సమయంలోనే తెలుగు యువత నాయకుడి తమ్ముడు నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డాడు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కంచి శ్రీనివాసరావు ఫక్తు రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
వినుకొండ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ‘‘మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు!’’ అంటూ ట్వీట్ చేశారు.
మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా
ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ
దారుణ హత్య జరిగి ఉండేది కాదు !— Ambati Rambabu (@AmbatiRambabu) July 17, 2024
ఇదీ చదవండి: గూండారాజ్.. రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య