
సాక్షి, గుంటూరు(వినుకొండ) : బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో మంళవారం చోటు చేసుకుంది. వినుకొండ టౌన్ సీఐ చినమల్లయ్య వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేమారెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కన వాళ్లు వచ్చారు. అంతలోకి నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment