వినుకొండ (గుంటూరు) : గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని వినుకొండ పట్టణంలో ఈ రోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు ప్రముఖుల ఇళ్లల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దీంతో రియల్టర్‌లు బెంబేలెత్తుతున్నారు. అయితే ఇప్పటి వరకూ దాడులకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.