
సాక్షి, వినుకొండ రూరల్: పొరుగు రాష్ట్రం వాడు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు.. నిద్రలోనే ప్రాణం విడిచాడు.. చూసిన వారు అయ్యో అని నిట్టూర్పు విడిచారు. ఈ విషాద సంఘటన గుంటూరుజిల్లా వినుకొండ మండలం నాగులవరంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. షేక్ సలీమ్‌భాయ్(75) అనే వ్యక్తి నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో అగర్‌బత్తీలు, అత్తరు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిమాదిరి శనివారం రాత్రి వ్యాపారం ముగించుకుని నాగులవరం సెంటర్‌లోని ఓ దుకాణం వద్ద నిద్రించాడు. తెల్లవారాక చూస్తే అతను మృతిచెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతుడి వద్ద పరిశీలించగా అతని జేబులో దొరికిన ఆధారాలనుబట్టి కర్నాటక రాష్ట్రంలోని వెల్లూరు పట్టణానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment