
ఎక్స్ వేదికగా ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ గూండాలు నరరూపరాక్షసుల్లా తయారయ్యారని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడింది. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. వినుకొండ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు రషీద్‌పై టీడీపీకి చెందిన గూండా జిలానీ పాశవికంగా కత్తితో దాడిచేసి హతమార్చారని ఆరోపించింది.
అందరూ చూస్తుండగా, దారుణంగా రెండు చేతులు నరికి మెడపై కూడా పదేపదే కత్తితో వేటువేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడని తెలిపింది. కొన ఊపిరితో ఉన్న రషీద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడని పేర్కొంది. టీడీపీతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ టీడీపీ వాళ్ల రాక్షసానందానికి ఇంకెంత మంది బలి అవ్వాలి? అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment