ఇనిమెళ్ళలో వైఎస్సార్ సీపీ వర్గీయులు ఇళ్లపై రాళ్ల వర్షం
వినుకొండ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపిన ఆదరణను చూసి ఓటమి భయంతో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో టీడీపీ వ ర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని భౌతిక దాడులకు దిగుతున్నారు. అధికారులు సైతం ఏకపక్షంగా వ్యవహిరిస్తున్నారని అందువలనే వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారని అంటున్నారు. శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారు.
సైకిల్‌కు ఓటు వేయలేదన్న అక్కసుతో అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారు. ఇంత జరిగినా ప్రశ్నించేవారు లేకపోవడంతో వారి ఆగడాలకు అద్దూ ఆపులేకుండా పోయింది. దీంతో నియోజవర్గ పరిధిలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల రోజు ఈపూరు మండలంలోని ఇనిమెళ్ళలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ వర్గానికి చెందినవారిపై రాళ్ల వర్షం కురిపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయని రెచ్చిపోతున్నారు.
దీంతో ఆ గ్రామంలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందోనన్న భయంతో గ్రామంలో ఉన్న మహిళలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇదే మండలానికి చెందిన చిట్టాపురం, గోపువారిపాలెం, ముప్పాళ్ళ, శ్రీనగర్ తదితర గ్రామాల్లో టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. బొల్లాపల్లి మండలంలోని పలుకూరు, రేమిడిచర్ల, వడ్డెంగుంట గ్రామాల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేకున్నాయి. పోలీసుల బందోబస్తు కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయి. పోలీసుల హెచ్చరికలను భేఖాతర్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావణం నెలకొల్పాలని అంటున్నారు.
ఓటు వేయలేదని టీడీపీ వర్గీయుల దాడులు
Published Sat, May 10 2014 1:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement