savalyapuram
-
ప్రియుడితో పెళ్లి చేయాలని వివాహిత హల్చల్
వినుకొండ: వివాహిత సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకు చెందిన ముట్లూరి లాజరు కుటుంబ సభ్యులు జీవనోపాధి నిమిత్తం కర్నూలు జిల్లాకు ప్రతి ఏడాది వెళతారు. ఈ నేపథ్యంలో జలదుర్గం గ్రామానికి చెందిన ముస్లిం వివాహిత పఠాన్‌షాహీనీతో లాజరుకు పరిచయం ఏర్పడి సహజీవనం వరకు వెళ్లింది. పఠాన్‌షాహీన్‌కు గతంలో వివాహం జరగటం, వ్యక్తిగత కారణాలు వల్ల తన భర్త నుంచి దూరంగా ఉంటుంది. కర్నూలు జిల్లాలో పనులు ముగించుకొని స్వగ్రామానికి లాజరు, వివాహిత వచ్చి నెల రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో గురువారం వివాహం చేసుకోవాలని లాజరుపై వివాహిత ఒత్తిడితేవటం ప్రారంభించింది. భర్త నుంచి విడాకులు తీసుకొని వస్తేనే వివాహం చేసుకుంటానని లాజరు, వివాహితకు తెలిపాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వివాహిత సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేయటంతో గ్రామస్తులు చూసి పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం తెలిపారు. సంఘటన స్థలానికి వీఆర్వో నబీ, పోలీసులు చేరుకొని వివాహితని సెల్‌టవర్ నుంచి దించి పోలీసుస్టేషను తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
గుంటూరు క్రైమ్: గుంటూరు జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని శావల్యాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. శావల్యాపురం మండల కేంద్రంతోపాటు మండలంలోని సేలంపూడి, గొంగిలిపాలెం, మత్కుమల్లి గ్రామాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఎక్కడా ఆస్తి నష్టం నమోదు కాలేదు. నవ్యాంధ్ర రాజధాని భూకంప తీవ్రత కలిగిన జోన్ పరిధిలోనే ఉందని ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ రామచర్ల ప్రదీప్‌కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. -
ఓటు వేయలేదని టీడీపీ వర్గీయుల దాడులు
ఇనిమెళ్ళలో వైఎస్సార్ సీపీ వర్గీయులు ఇళ్లపై రాళ్ల వర్షం వినుకొండ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపిన ఆదరణను చూసి ఓటమి భయంతో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో టీడీపీ వ ర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని భౌతిక దాడులకు దిగుతున్నారు. అధికారులు సైతం ఏకపక్షంగా వ్యవహిరిస్తున్నారని అందువలనే వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారని అంటున్నారు. శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారు. సైకిల్‌కు ఓటు వేయలేదన్న అక్కసుతో అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరిచారు. ఇంత జరిగినా ప్రశ్నించేవారు లేకపోవడంతో వారి ఆగడాలకు అద్దూ ఆపులేకుండా పోయింది. దీంతో నియోజవర్గ పరిధిలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల రోజు ఈపూరు మండలంలోని ఇనిమెళ్ళలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ వర్గానికి చెందినవారిపై రాళ్ల వర్షం కురిపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయని రెచ్చిపోతున్నారు. దీంతో ఆ గ్రామంలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందోనన్న భయంతో గ్రామంలో ఉన్న మహిళలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇదే మండలానికి చెందిన చిట్టాపురం, గోపువారిపాలెం, ముప్పాళ్ళ, శ్రీనగర్ తదితర గ్రామాల్లో టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. బొల్లాపల్లి మండలంలోని పలుకూరు, రేమిడిచర్ల, వడ్డెంగుంట గ్రామాల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేకున్నాయి. పోలీసుల బందోబస్తు కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయి. పోలీసుల హెచ్చరికలను భేఖాతర్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావణం నెలకొల్పాలని అంటున్నారు.