ప్రియుడితో పెళ్లి చేయాలని వివాహిత హల్‌చల్‌ | Women Climbs Cell Tower At kanamarlapudi | Sakshi
Sakshi News home page

ప్రియుడితో పెళ్లి చేయాలని వివాహిత హల్‌చల్‌

May 4 2017 8:05 PM | Updated on Aug 24 2018 2:36 PM

వివాహిత సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి గ్రామంలో చోటుచేసుకుంది.

వినుకొండ: వివాహిత సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకు చెందిన ముట్లూరి లాజరు కుటుంబ సభ్యులు జీవనోపాధి నిమిత్తం కర్నూలు జిల్లాకు ప్రతి ఏడాది వెళతారు. ఈ నేపథ్యంలో జలదుర్గం గ్రామానికి చెందిన ముస్లిం వివాహిత పఠాన్‌షాహీనీతో లాజరుకు పరిచయం ఏర్పడి సహజీవనం వరకు వెళ్లింది. పఠాన్‌షాహీన్‌కు గతంలో వివాహం జరగటం, వ్యక్తిగత కారణాలు వల్ల తన భర్త నుంచి దూరంగా ఉంటుంది.

కర్నూలు జిల్లాలో పనులు ముగించుకొని స్వగ్రామానికి లాజరు, వివాహిత వచ్చి నెల రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో గురువారం వివాహం చేసుకోవాలని లాజరుపై వివాహిత ఒత్తిడితేవటం ప్రారంభించింది. భర్త నుంచి విడాకులు తీసుకొని వస్తేనే వివాహం చేసుకుంటానని లాజరు, వివాహితకు తెలిపాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వివాహిత సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేయటంతో గ్రామస్తులు చూసి పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం తెలిపారు. సంఘటన స్థలానికి వీఆర్వో నబీ, పోలీసులు చేరుకొని వివాహితని సెల్‌టవర్‌ నుంచి దించి పోలీసుస్టేషను తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement