
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పసుపులేరు బ్రిడ్జిపై లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషయంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారంతా వినుకొండ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల వారుగా గుర్తించారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. ఏకకాలంలో 15 చోట్ల దాడులు
Comments
Please login to add a commentAdd a comment