lorry-car collided
-
Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్పల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొట్టింది. టైరు పగిలి అదుపుతప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. అనంతపురం- కడప జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు.మృతుల వివరాలు...శ్రీధర్(28)సంతోష్ (26)వెంకన్న (35)ప్రసన్న (34)వెంకీ (24)షణ్ముఖ (30) -
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పసుపులేరు బ్రిడ్జిపై లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషయంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారంతా వినుకొండ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల వారుగా గుర్తించారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఏకకాలంలో 15 చోట్ల దాడులు -
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు మృతి
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూర్ హైవే ముత్యాలమ్మ గూడెం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ట్రాఫిక్‌జామ్‌లో లారీ మరొక కారును ఢీకొట్టింది. దీంతో మరో కారులో ఉన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం మృతుల సంఖ్య అయిదుకు చేరింది. చనిపోయిన ఐదుగురిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. భారీగా హైవేపై ట్రాఫిక్ జామ్‌ను కట్టంగూర్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. -
రక్తమోడిన రహదారి
కారును ఢీకొన్న లారీ.. షిర్డీ వెళ్తూ ముగ్గురి మృతి కొండాపూర్: స్నేహితులందరూ కలిసి షిరిడీ దైవదర్శనం కోసం బయలుదేరి ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డారు. కారులో తెల్లవారు జామున 3 గంటలకు బయలుదేరి గంటపాటు ప్రయాణించిన తర్వాత ఎదురుగా వస్తున్న లారీ మత్యువు రూపంలో వచ్చి ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించి కొండాపూర్ సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రామచంద్రాపురం మండలంలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన శేఖర్ (35), వెంకటేశంచారి (33), కుమార్(33), చంద్రశేఖర్‌చారి (35), వెంకట్‌చారి (35)లు స్నేహితులు. శేఖర్ ఎలక్ర్టిషియన్‌గా పని చేస్తున్నాడు. కుమార్ బీహెచ్ఈఎల్లో కేబుల్ ఆపరేటర్, వెంకటేశంచారి కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మిగతా ఇద్దరితో కలిసి షిరిడీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 3 గంటలకు కారు(ఏపీ09బీఎక్స్7117)లో బయలుదేరి కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారి దగ్గరకు చేరుకోగానే ఉదయం 4 గంటల ప్రాంతంలో బీదర్ నుంచి ఎదురుగా వస్తున్న జీడీ12వై7654 నంబర్‌గల లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే కుమార్, వెంకటేశంచారి, శేఖర్లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన చంద్రశేఖర్, వెంకట్చారిలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడు కుమార్ సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఘోర రోడ్డుప్రమాదం : ఐదుగురి మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మేదరమెట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును టిప్పర్ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పాత గుంటూరుకు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డు అధికారి మాచర్ల వీరాస్వామి తన మనవరాలు నిత్య(9 నెలలు) పుట్టు వెంట్రుకలు తీయించేందుకు 12 మంది కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. తిరుమల దర్శనం ముగించుకుని తిరిగి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులోని ముగ్గురు కిందికి దిగి ముందుకు తోసేందుకు యత్నిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కిందనున్న ముగ్గురూ త్రుటిలో తప్పించుకున్నారు. కారు డ్రైవర్ సహా అందులోని నలుగురు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను కృష్ణ(3), నిత్య(1), చిన్నికృష్ణ(4), వాసవి(4) గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.