రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి | two people died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Published Sun, Jan 29 2017 4:27 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

two people died in road accident

వినుకొండ(గుంటూరు జిల్లా): వినుకొండ మండలం చాట్రగడ్డపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఐదుగురు యువకులను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే బైక్‌పై ఐదుగురు ఎక్కి ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వినుకొండ మండలకేంద్రం అంబేద్కర్‌ నగర్‌కు చెందిన ఐదుగురు యువకులు గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement