
చంద్రబాబును అడ్డుకున్న రైతులు
గుంటూరు: పంటల రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అన్నదాతలను పక్కకు తోసేసి చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకు పంపించారు.
సీఎం సమాధానంగా చెప్పకుండా వెళ్లిపోవడంపై రైతులు మండిపడుతున్నారు. అంతకుముందు వినుకొండలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా స్థానికులతో ముఖాముఖీ మాట్లాడారు.