గుంటూరు జిల్లా వినుకొండ మండలం వెంకిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థినులు మృతి
Published Sat, Dec 24 2016 2:49 PM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండలం వెంకిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. బొల్లాపల్లి మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న భారతీబాయి, భరణీ బాయిలు పాఠశాలకు క్రిస్మస్ సెలవులు ఇవ్వడంతో వినుకొండ వచ్చారు. అక్కడ తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుని బంధువుల అబ్బాయి బైక్‌పై వెళ్తున్నారు. ఓ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు బాలికల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. కాగా, బైక్ నడుపుతున్న బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
Advertisement
Advertisement