రషీద్ కుటుంబానికి అండగా నిలవాలి
మాజీ ఎమ్మెల్యే బొల్లాకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశం
తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం
సాక్షి, అమరావతి: ఏపీలో సాగుతోన్న రాక్షస పాల నపై ప్రజాపోరాటం చేద్దామని వైఎస్సార్‌సీపీ అధ్య క్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ నడిరోడ్డుపై పాశ వికంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘట న గురించి తెలియగానే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. రషీద్ కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు.
గురు వారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని నివా సానికి చేరుకున్న వైఎస్ జగన్.. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు జరిగిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అధికారంలోకి వచ్చిన పార్టీ దృష్టి పెట్టాలిగానీ.. వైఎస్సార్‌సీపీని అణగదొక్కాలనే కోణంలో దారు ణాలకు పాల్పడటం హేయమన్నారు.
కొత్తగా కొలు వుదీరిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని అనుకున్నామని.. కానీ అధికారంలోకి వచ్చిన నెల న్నరలోనే హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలకు రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారని తెలిపారు. వినుకొండలో రషీద్‌ను పాశవికంగా హత్య చేయడం అందుకు పరాకాష్ట అన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని మండిపడ్డారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనడానికి నెలన్నర రోజులుగా సాగుతున్న అరాచకాలే తార్కాణమన్నారు. ప్రజ లందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ సీఎం సహా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులే రాజకీయ దురు ద్దేశాలతో వెనకుండి ప్రోత్సహిస్తుండటం వల్లే ఇ లాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయ న్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని.. అంద రికీ అండగా నిలుస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment