
టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబానికి పరామర్శ
వైఎస్సార్‌సీపీ నేతలంతా బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలని ఆదేశం
హింసాత్మక విధానాలను విడనాడాలని ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబుకు గట్టి హెచ్చరిక
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండ రాను న్నారు. టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలు దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు.
టీడీపీ మూకల నరమేథం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్ కుటుంబ సభ్యులను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు.
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేదు..
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూ టమి సర్కారు ఘోర వైఫల్యం, టీడీపీ నేతల అరాచక పర్వంపై వైఎస్ జగన్ గురువారం ‘ఎక్స్’ వేదిక గా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగు తోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘వైఎస్సార్ సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పా ల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షపూరిత దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది.
నిన్న వినుకొండ లో నరమేథం ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గు చేటు’ అని పేర్కొ న్నారు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశా లతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ‘ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నే రగాళ్లు, హంతకులు చెలరేగి పోతున్నారు’ అని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధా నాలు వీడాలని సీఎం చంద్రబా బును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు చెప్పా రు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై న తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్రప్రభుత్వ ఏజెన్సీ లతో ప్రత్యేక విచారణ నిర్వహించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. టీడీపీ మూక చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఈ అరాచకాలకు చంద్రబాబుదే బాధ్యత
పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వినుకొండలో నరమేధానికి తెగబడి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో మిథున్‌రెడ్డి, రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైందని చెప్పేందుకు ఈ అరాచకాలే నిదర్శనమని, వీటికి సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment