శావల్యాపురం(వినుకొండ) : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించడంతో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ లేళ్ల లోకేశ్వరరావు సోమవారం మీడియాతో చెప్పారు. మండల కేంద్రం శావల్యాపురంలో టీడీపీ నాయకులు జాతీయ రహదారి మార్గంలో గుంపులుగా ఏర్పడి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడమే కాకుండా.. ట్రాఫిక్, ఎన్నికల నిబంధనలు అతిక్రమించినందున మాజీ ఎమ్మెల్యేతో పాటు.. టీడీపీ నేతలు గుంటూరు సాంబశివరావు, గడుపూడి విశ్వనాథం, చెరుకూరి చౌదరి, గోరంట్ల హనుమంతరావు, యరమాసు కోటేశ్వరరావు, పారా చౌదరి, చింతా గంగయ్య, అమృతపూడి కోటయ్య, మాదాల చిరంజీవి, బొల్లా పేరయ్య, దొడ్డా ఏడుకొండలు తదితరులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment