
మృత్యుంజయుడు చంద్రశేఖర్ జీజీహెచ్ నుంచి డిశ్చార్జి
నగరంపాలెం (గుంటూరు) : గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామంలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడి మృత్యుంజయుడిగా బయటపడిన చిన్నారి అనుమళ్లమూడి చంద్రశేఖర్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శనివారం డిశ్చార్జి చేశారు. బోరుబావిలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత చికిత్స నిమిత్తం చిన్నారిని జీజీహెచ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
డిశ్చార్జి సందర్భంగా చిన్నారికి ఆటవస్తువులు అందించి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టరు డీఎస్ రాజునాయుడు అంబులెన్స్‌లో వారిని స్వగ్రామానికి పంపారు. మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేందుకు సహకరించిన వైద్య బృందానికి చిన్నారి తండ్రి మల్లికార్జునరావు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.