11వ వార్డు అభ్యర్థి సుజాత ఏకగ్రీవం
నామినేషన్లను ఉపసంహరించుకున్న అభ్యర్థులు
పులివెందుల, న్యూస్‌లైన్ : వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో పోలింగ్‌కు ముందే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బోణీ కొట్టింది. పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి 11వ వార్డు వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి పి.సుజాతనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11వ వార్డులో టీడీపీ తరపున ఇద్దరు అభ్యర్థులతోపాటు ఇండిపెండెంటుగా ఒక అభ్యర్థి నామినేషన్లు వేశారు.
బొగ్గుడుపల్లె, బసిరెడ్డిపల్లె, వెలమవారిపల్లె గ్రామాలు 11వ వార్డు పరిధిలోకి వస్తాయి. సుమారు 1300లకుపైగా ఓటర్లు ఉన్న ఈ వార్డులో వైఎస్‌ఆర్ సీపీ తరపున ఈనెల 13వ తేదీన రమేష్, శేఖర్‌నాయుడులతో కలిసి సుజాత నామినేషన్ వేశారు. సుజాత సరైన అభ్యర్థి అని భావించిన టీడీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు.. స్వతంత్య్ర అభ్యర్థి సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగ్లవారం వరకు గడువు ఉండటంతో అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.